కళ తప్పిన చెరువులు
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:22 PM
ఇంతకుముందెన్నడూ లేని గ డ్డు పరిస్థితి ఎదురుకాబోతుంది.. వర్షాకాలం ము గిసే దశకు చేరుకున్నా ఇప్పటి వరకు భారీ వ ర్షం కురవలేదు.
- నీరు లేక వెలవెల
- గతేడాది ఆగస్టులోనే అలుగులు పారిన వైనం
- కృత్రిమ బేబీ పాండ్లు ఏర్పాటు
- భారీ వినాయక విగ్రహాలు బీచుపల్లికే
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఇంతకుముందెన్నడూ లేని గ డ్డు పరిస్థితి ఎదురుకాబోతుంది.. వర్షాకాలం ము గిసే దశకు చేరుకున్నా ఇప్పటి వరకు భారీ వ ర్షం కురవలేదు. దీంతో నీళ్లు లేక చెరువుల్లో కళ తప్పాయి. గతేడాది ఇదే సమయంలో జిల్లాలోని చెరువులన్నీ అలుగులు పారగా, ఏడాదిలోనే అం దుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ ర్షాలు లేక పంటలు ఎండిపోతుండగా, ఇప్పుడు గణేశ్ ఉత్సవాలకు వరణుడి ఎఫెక్ట్ తగిలింది. ఏ చెరువుకు వినాయకుడిని తీసుకెళ్లినా మునిగే ప రిస్థితి లేకపోవడంతో నిర్వాహకులు తలలు ప ట్టుకుంటున్నారు. దాదాపు అందరూ ప్రతీ ఏటా ఒక చెరువును ఎంపిక చేసుకుని అక్కడే నిమజ్జ నం చేయడం అలవాటుగా వస్తోంది. ఈసారి రె గ్యూలర్ చెరువులన్నీ కళ తప్పడంతో చెరువుల కోసం వెతికే పనిలో పడుతున్నారు. నగరాలు, ప ట్టణాలకు ఆనుకుని ఉన్న చెరువుల్లోకి నగరం, పట్టణాలకు సంబంధించిన నీరు చేరి అలాంటి చెరువుల్లో మాత్రమే నీరుంది. ఆ చెరువుల్లో వి నాయకులను నిమజ్జనం చేయడానికి నిర్వాహకు లు ఆసక్తి చూయించడం లేదు. బండ్రవల్లి వా గు, హన్వాడ లాంటి చెరువుల్లో కూడా నీ రులేదు. మిగిలింద ల్లా బీచుపల్లి, శ్రీశైలం, జూరాల మాత్రమే. చాలా మంది అంత దూరం వెళ్లి నిమజ్జ నం చేసే పరిస్థితి లే కపోవడంతో సమీపం లో ఎక్కడ నీరుందా అని వెతుక్కునే పని లో పడ్డారు.
కృత్రిమ బేబీ పాండ్ ఏర్పాటు..
వినాయక విగ్రహాల నిమజ్జనానికి నీటి సమ స్య ఉండటంతో అధికార యంత్రాంగం చిన్న వి గ్రహాల నిమజ్జనం కోసం కృత్రిమ బేబీ పాండ్ లను ఏర్పాటు చేస్తుంది. చిన్న విగ్రహాలను ఇక్క డ నిమజ్జనం చేయాలని, పెద్దవాటిని బీచుపల్లికి తరలించాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో కృత్రిమ బేబీ పాండ్ ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ప రిధిలోని అప్పన్నపల్లి గంగోస్ కుంటలో రెండు బేబీ ఫాంట్‌లు, పంచవటి విద్యాలయం సమీపం లోని పార్క్‌లో ఒకటి, దేవరకద్ర మునిసిపాలిటీ పరిధిలోని స్టేషన్ రోడ్ చర్చి సమీపంలో, జడ్చర్ల మునిపిపాలిటీ పరిధిలోని మునిసిపల్ కార్యాల యం వద్ద, బీసీ హాస్టల్ వెనక పార్క్‌లో, 8వ వా ర్డులోని హౌసింగ్ బోర్డు కాలనీ పార్క్‌లో, భూ త్పూర్ పరిధిలోని రాందాస్‌తండాలో కృత్రిమ బేబీ పాండ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదు అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేసుకు నేందుకు అనువుగా ఉంది.
పాలమూరులో ఎన్‌నినో తీవ్ర ప్రభావం..
పాలమూరు జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. జూలై, ఆగస్టులో ఒకట్రెండు వర్షాలు మాత్రమే కురవగా, సెప్టెంబరులో 18 రోజుల్లో చుక్క వర్షం పడకపోగా, 36, 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండ టంతో తేమ శాతం తగ్గిపోయి పగలు తీవ్ర ఎండ, రాత్రి ఉక్కపోత వేస్తోంది. ఎండలను చూస్తే రెండో ఎండాకాలం వచ్చిందన్న చర్చ ప్రజల్లో సాగుతోంది. జిల్లాలో 30శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 10 మండ లాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో తీ వ్ర లోటు, ఆరు మండలాల్లో సాధారణ వర్ష పాతం నమోదైంది. జిల్లాలో సెప్టెంబరు నా టికి 471 మిల్లీ మీటర్ల సాధారణ వర్షానికి గా ను, 333 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈనెలలో శుక్రవారం రాత్రి జిల్లా లో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. హన్వాడ మండలంలో అత్యధికంగా 85 మిల్లీ మీటర్లు. జడ్చర్లలో 58 మిల్లీ మీటర్లు, కోయిల కొండలో 47 మిల్లీ మీటర్లు, మహబూబ్‌నగర్ రూరల్‌లో 37 మిల్లీ మీటర్లు, మిడ్జిల్‌లో 34 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గతేడాది ఆగ స్టులో సాధారణం కన్నా 152 మిల్లీ మీటర్ల వర్షం అధికంగా కురవడంతో ఆ నెలలోనే అ లుగులు పారాయి.