Share News

బడిలో భద్రత కరువు

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:49 PM

నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు

బడిలో భద్రత కరువు
మరికల్‌ మండలం తీలేర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూలిపోయిన ప్రహరీ

- నారాయణపేట జిల్లాలో వరుస ఘటనలు

- ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

నారాయణపేట, నవంబరు19 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక సంఘటనను మరచిపోకముందే మరో సంఘటన జరుగుతుండటంతో పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- ఈ నెల 18న మరికల్‌ మండలం తీ లేర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయి ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్న భోజ నం తర్వాత కొందరు విద్యార్థులు ప్రహరీపైకి ఎక్కడంతో అది కుప్పకూలిపోయింది. మిగితా విద్యార్థులు పరుగులు తీయడంతో క్షేమంగా బయటపడ్డారు.

- ఈ నెల 16న నారాయణపేట కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో ఎంబీబీఎస్‌ విద్యార్థినులు నివసిస్తున్న వసతి గృహంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గమనించి విద్యార్థినులు బయటకు పరుగులు పెట్టడంతో క్షేమంగా ఉన్నారు. గదిలోని దుస్తులు, ఇతర వస్తువులు పూర్తి గా కాలిపోయాయి.

- సెప్టెంబరు 19న ధన్వాడ మోడల్‌ స్కూల్‌, కాలేజీ వసతి గృహంలో ఆహారం కలుషితమై 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

- అగస్టు 6న ఎక్లా్‌సపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి రంజిత్‌(9) పాము కాటుతో మృతి చెందాడు. అతడు టీచర్‌ చెప్తున్న పాఠాన్ని వింటుండగా పక్కనే ఉన్న కిటికీలో నుంచి పాము వచ్చి అతడిని కాటు వేసింది. వెంటనే స్పందించిన ఉపాధ్యాయుడు బాలుడిని జిల్లా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, సీనియర్‌ ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్ర త,పాత భవనాలు, ప్రహరీలకు మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే నూతనంగా నిర్మించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Nov 19 , 2026 | 11:49 PM