Share News

12న పాలమూరుకు కేటీఆర్‌

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:52 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈనెల 12న పాలమూరుకు వస్తున్నారని మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఆ రోజు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సత్కరించనున్నారని తెలిపారు.

12న పాలమూరుకు కేటీఆర్‌
మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్‌

మహబూబ్‌నగర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈనెల 12న పాలమూరుకు వస్తున్నారని మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఆ రోజు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సత్కరించనున్నారని తెలిపారు. కేటీఆర్‌ సభ కోసం శుక్రవారం మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి నగరంలోని ఎంబీసీ మైదానాన్ని పరిశీలించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడారు. కేటీఆర్‌ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మరో రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయ న్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రానున్న కార్పొరేషన్‌, పురపాలిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్‌ ఇస్తామన్నారు. పోటీలో ఉన్నవాళ్ళు వారి విజయం కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకు లు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహు లు, రహమాన్‌, బాలరాజు, నరేందర్‌, కరుణాకర్‌గౌడ్‌, మహేందర్‌, దేవేందర్‌రెడ్డి, గణేష్‌, కోట్ల నర్సింహ, కొండ లక్ష్మ య్య, అనంతరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, అన్వర్‌పాష, వేదవ్రత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 10:52 PM