Share News

రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా కేఎస్‌ రవికుమార్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:31 PM

జిల్లా రెడ్‌క్రాస్‌ నూతన కమిటీకి శనివారం ఎన్నికలు జరిగాయి.

రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా కేఎస్‌ రవికుమార్‌
చైర్మన్‌ను అభినందిస్తున్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

అభినందించిన ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా రెడ్‌క్రాస్‌ నూతన కమిటీకి శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా కేఎస్‌ రవికుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రామకృష్ణయ్య, కోశాధికారిగా రమణయ్యతో పాటు సభ్యులుగా బాబుల్‌రెడ్డి, విష్ణుజనార్దన్‌, లక్ష్మినారాయణ, దేవిక, ధర్మరాజు, డాక్టర్‌ శ్యామ్యూల్‌, తిరుపతిరెడ్డి జయరాములు, పుట్టపాగ రఘుపతి, రవికుమార్‌యాదవ్‌, సురభి, జగపతిరావు, వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఎన్నికయ్యారు. అనంతరం అందరు కలిసి ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవగా, వారిని శాలువాతో కప్పి సన్మానించారు. రెడ్‌క్రాస్‌ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు గ్రామీణ స్థాయి వరకు విస్తృతం చేయాలన్నారు. డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:31 PM