సహజ సాగుకు ‘కృషి సఖి’ సహకారం
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:27 PM
జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్-2024)
మండలానికి ఒకరి చొప్పున ఎంపిక
పాలమూరులో 5 రోజుల పాటు శిక్షణ
ప్రారంభమైన తొలివిడత తరగతులు
పాలమూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : మోతాదుకు మించి పురుగు మందులు, ఎరువు లు వాడటంతో సహజత్వాన్ని కోల్పోయిన భూ ములను యథాస్థితికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్-2024) పేరుతో దీనిని అమలు చేస్తోంది. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 20 క్లస్టర్లను గుర్తించి, ఒక్కో క్లస్టర్‌లో 125 మంది రైతులను అధికారు లు ఎంపిక చేశారు. సహజ వ్యవసాయంపై వారికి శిక్షణ ఇచ్చేందుకు మండలానికి ఒకరు చొప్పున కృషి సఖి (మహిళా రైతులు)లను ఎం పిక చేశారు. ఎకో క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం లో వారికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నా రు. తొలి విడత శిక్షణా తరగతులు మహబూబ్ నగర్ పట్టణంలో మంగళవారం ప్రారంభమ య్యాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. సహజ పద్ధతుల్లో, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించడంపై వ్యవసాయ నిపు ణులు, శాస్త్రవేత్తలు, అధికారులు వారికి అవగా హన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు కృషి సఖిలను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించి అభి ప్రాయాలు తెలుసుకున్నది.
కలిసి పని చేస్తే సత్ఫలితాలు
భూమిలో సారాన్ని యథాస్థితికి తీసుకు రావాలి. అందు కోసం ప్రభు త్వం, కృషిసఖి, రైతులు, వ్యవసాయా ధికారులు, రైతులు కలిసి పని చే యాలి. అప్పుడే సత్ఫలి తాలు సాధించవచ్చు.
- రాజవర్ధన్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్
సహజ సాగే లక్ష్యం
మాకు పది ఎకరాల పొలం ఉంది. చాలాకాలం నుంచి మేము ఎరువులు, పురుగుమందులను వినియోగించకుండా సాగు చేస్తున్నాం. పురుగు మందుల వినియోగంతో భూమిలో సారం పోతుంది. భసారాన్ని పెంచేందుకు అధికారులు, నిపుణులు శిక్షణలో చెప్పిన పద్ధతులను పాటించి, రైతులతో సహజ సాగు చేయించటమే మా లక్ష్యం.
- సుజాత, చిన్నచింతకుంట మండలం