స్వరాష్ట్ర సాధన స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:28 PM
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి, మలిదశ ఉద్యమాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొనియాడారు.
ఘనంగా జయంతి వేడుకలు
జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించిన అధికారులు, వివిధ పార్టీల నాయకులు
గద్వాల టౌన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి, మలిదశ ఉద్యమాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొనియాడారు. స్వాతంత్య్ర పోరా టంతో పాటు నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్న బాపూజీ సొంత రాష్ట్రం ఏర్పాటు కోసం మంత్రి పదివిని సైతం తృణప్రాయంగా త్యజించిన త్యాగశీలి అని కీర్తించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక న్యూగంజ్ సమీపంలో గల దివంగత నేత విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, సొంత రాష్ట్రం ఏర్పాటు జరిగే వరకు ఎలాంటి పదవులను స్వీకరించబోనని మంత్రి పదవిని వదులుకున్న బాపూజీ చివరి శ్వాస వరకు మాటకు కట్టుబడి ఉన్న తీరు నేటితరం ప్రజానాయకులకు ఆదర్శమన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మల నరసింహులు యాదవ్, కురుమన్న, రామాంజనేయులు, గణేశ్, పాషా, కుమార్, అక్కల శ్రీనివాసులు, శాంతన్న, మంత్రి సురేశ్, తిరుమల త్యాగరాజు, సాయిబాబు, శ్రీకాంత్ ఉన్నారు.