త్వరలో కోయిలకొండ సాగునీటి కల సహకారం
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:27 PM
త్వరలో కోయిలకొండ మండలానికి సాగునీటి కల సాకారం అవుతోందని ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలసిరావాలని నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కే.శివకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
- కాంగ్రెస్ నాయకుడు శివకుమార్‌రెడ్డి
కోయిలకొండ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) త్వరలో కోయిలకొండ మండలానికి సాగునీటి కల సాకారం అవుతోందని ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలసిరావాలని నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కే.శివకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని అంకిళ్ల లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. కోయిలకొండలోని గణపతిరాయుని చెరువు, కొండ చెరువుతోపాటు పెద్ద చెరువులకు నీరు తీసుకరావడానికి సీఎం రేవంత్‌రెడ్డితో కలసి చర్చించానని, ఇందుకు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని, ఇందుకోసం కోయిలకొండ రాజకీయ పార్టీల నాయకులు సహకారం అందించాలని కోరగా సర్పంచులతో పాటు నాయకులు డబ్బులు అందించేందుకు ముందుకొచ్చారు. అంకిళ్ల గోదాంలో రూ.22 లక్షలతో నిర్మిస్తున్న ప్రహరీకి సర్పంచులతో శంకుస్థాపన చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి.శేఖర్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సర్పంచులు రాజారఘుపతిరెడ్డి, రామునాయక్, సంపత్, గోవర్దన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వంశీ, సందీప్, రామకృష్ణ, శ్రీశైలంతో పాటు నాయకులు రవీందర్, కొండారెడ్డి, సత్యపాల్‌రెడ్డి, రవినాయక్, మోహన్‌రెడ్డి గోపాల్, శ్రీపాదరావు పవన్‌గౌడ్, రామస్వామి, నాగరాజు, గౌస్, బాల్‌రాజ్‌గౌడ్, సత్యం పాల్గొన్నారు.