Share News

కేజీబీవీలో ఖేలో ఇండియా రెజ్లింగ్‌ శిక్షణ ప్రారంభం

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:23 PM

మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ రెజ్లింగ్‌ కోచింగ్‌ క్యాంపు సోమవారం ప్రారంభించారు.

కేజీబీవీలో ఖేలో ఇండియా రెజ్లింగ్‌ శిక్షణ ప్రారంభం
శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివారెడ్డి

ధన్వాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ రెజ్లింగ్‌ కోచింగ్‌ క్యాంపు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి బాలికల రెజ్లింగ్‌ క్రీడాకారులు హాజరయ్యారు. నారాయణపేట క్రీడాకారులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివారెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ధన్వాడ సర్పంచు పంది రామచంద్రయ్య, ఎమ్మెల్యే పీఏ మాధవరెడ్డి, నారాయణపేట కేజీబీవీ ప్రత్యేకాధికారి కల్పన, పీడీలు సాయినాథ్‌, అనంతసేన, వెంకటప్ప, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:23 PM