కేసీఆర్ ఉద్యమ త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:19 PM
తెలంగాణ రాష్ట్ర సాధ నలో కేసీఆర్ ఉద్యమ త్యాగాలు మరవలేనివని బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు.
- ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
- దీక్షా దివస్‌లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి
నారాయణపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధ నలో కేసీఆర్ ఉద్యమ త్యాగాలు మరవలేనివని బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారా యణపేట సింగారం చౌరస్తాలో గల బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాల యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవి ష్కరించి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం 2009 నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన దీక్షాదివస్ ఫొటో ఎగ్జిబిషన్‌ను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభనుద్ధేశించి ఎస్‌ఆర్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించుకుని రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణు లకు సూచించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, వేపూరి రాములు, విజయ్‌సాగర్, చెన్నారెడ్డి, కన్నజగదీష్, భరత్, కా కర్ల నారాయణమ్మ, బోయ లక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్ తదితరు లున్నారు.