Share News

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:03 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల ను గద్వాల జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యక ర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
గద్వాలలోని పాతబస్టాండు సర్కిల్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

గద్వాల టౌన్‌/ గద్వాల న్యూటౌన్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల ను జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యక ర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గులాబీ శ్రేణులు కేకులు కట్‌ చే సి పంచారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రె డ్డు పంపిణీ చేశారు. తమ నాయకుడికి జన్మది న శుభాకాంక్షలు తెలపారు. గద్వాల జిల్లా కేం ద్రంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ కేక్‌ కట్‌ చేసి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకు లు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ జిందాబాద్‌.. కేసీఆర్‌ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశా రు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి బా సు హనుమంతు నాయుడు, నూతన కౌన్సిలర్లు పులిపాటి వెంకటేశ్‌, నరసింహులు, మోహన్‌, నా యకులు కిరణ్‌, కమ్మరి రాము, కోటేష్‌ ఉన్నారు.

ఫ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మాజీ జెడ్పిటీసీ బాసు శ్యామల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు రోగులకు పం డ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీ ఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధ్యక్షులు బాసు హనుమంతునాయుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బీ ఎస్‌ కేశవ్‌, నాయకులు దుబ్బన్న, కిరణ్‌, మోహ న్‌, రాముడు, కోటేష్‌, రామకృష్ణ, నరసింహులు, బీచుపల్లి, యూసూప్‌, గంజిపేట రాజు, వెంకటేష్‌నాయుడు, డేవిడ్‌, బాసు గోపాల్‌ ఉన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:03 PM