కేసీఆర్ పదేళ్లల్లో.. చేసిందేమీ లేదు
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:11 AM
పదేళ్లు రాష్ట్రం లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభి వృద్ధిని పట్టించుకోలేదు కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఆర్థికంగా అభివృద్ధి చెందారని మంత్రి కొమటిరడ్డి విమర్శిం చారు.
- పాలమూరును పడావు పెట్టారు..
- కాంగ్రెస్ హయాంలో అభివృద్ధికి పెద్దపీట
- ఊక చెట్టు వాగు వంతెన ప్రారంభోత్సవంలో
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వనపర్తి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : పదేళ్లు రాష్ట్రం లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభి వృద్ధిని పట్టించుకోలేదు కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఆర్థికంగా అభివృద్ధి చెందారని మంత్రి కొమటిరడ్డి విమర్శిం చారు. ఆదివారం వనపర్తి జిల్లా మదనాపూర్ మండలంలో ని ఊకచెట్టు వాగుపై నిర్మించిన వంతెనను మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మదనాపురం మార్కె ట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణను తీ సుకురాలేదని, ఉద్యమకారుల పోరాటం, విద్యార్థుల బలిదా నాలను చూసి చలించిపోయి సోనియాగాంధీ ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఉద్దరిస్తా రని ప్రజలు భావించారు. కానీ, పదేళ్ల పాలనలో తెలంగాణ కు ఆశించిన స్థాయిలో అభివృద్ధ్ది జరగలేదన్నారు. పాలమూ రు రంగారెడ్డి ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్టు 90శాతం పూర్తైందని చెప్పుకున్న బీఆర్‌ఎస్ నాయ కులు మిగిలిన 10శాతం పనులను ఎందుకు పూర్తి చేయలే దని ప్రశ్నించారు. పాలమూరు ప్రజలపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే కుర్చీ వేసుకుని కరివేన ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఎందుకు నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు, ఏడు నెలల్లో కరివేన పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. ప్రజల ప్ర యాణ కష్టాలను తొలగించేందుకు రూ.6 కోట్లతో ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మించి నేడు ప్రారంభించుకోవడం సంతో షంగా ఉందన్నారు. అదేవిధంగా ఎమ్మార్వో, ఎంపీడీవో కా ర్యాలయాల భవనాల నిర్మాణానికి రూ.49కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
వెయ్యి రోజుల్లో రూ.1,034కోట్ల అభివృద్ధి
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 1000 రోజుల కాలంలో దేవర కద్ర నియోజకవర్గంలో రూ.1034కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేయించామని తెలిపారు. ఊకచెట్టు వాగుపై వంతెన లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారు. గతంలో వం తెన నిర్మించినప్పటికీ అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయక పోవ డంతో సమస్య కొసాగిందన్నారు. అప్రోచ్ రోడ్ల కోసం రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరగా రూ.6కోట్లు మంజూరు చేశారని, దీంతో వంతెన పనులు పూర్తి చేసి ప్రారంభించుకున్నామని తెలి పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించామని, మ హిళల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశం లో అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, ఆర్డీ వో సుబ్రహ్మణ్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్‌కుమార్, స్థానిక సర్పంచ్, నాయకులు నాగన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.