Share News

కారుకొండ అన్ని రంగాల్లో అభివృద్ధి

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:01 PM

మండలంలోని కారుకొండ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వ పథకాలు గ్రామంలోని పేదలకు సంపూర్ణంగా అందించేందుకు సర్పంచ్‌ ఆళ్ల సంతోషి కృషి చేస్తుందని గ్రూప్‌ 1 అధికారులు ఆనంద్‌రెడ్డి, రాజ్యలక్ష్మీ, రోజాబాయి, పాలకుర్తి సందీప్‌, ఐశ్వర్య, అంబటి మహేష్‌ ప్రశంసించారు.

 కారుకొండ అన్ని రంగాల్లో అభివృద్ధి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రూప్‌ 1 అధికారులు

- ప్రశంసించిన గ్రూప్‌ 1 శిక్షణ అధికారుల బృందం

నవాబ్‌పేట/చిన్నచింతకుంట ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కారుకొండ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వ పథకాలు గ్రామంలోని పేదలకు సంపూర్ణంగా అందించేందుకు సర్పంచ్‌ ఆళ్ల సంతోషి కృషి చేస్తుందని గ్రూప్‌ 1 అధికారులు ఆనంద్‌రెడ్డి, రాజ్యలక్ష్మీ, రోజాబాయి, పాలకుర్తి సందీప్‌, ఐశ్వర్య, అంబటి మహేష్‌ ప్రశంసించారు. బుధవారం రెండో రోజు గ్రామంలో పర్యటించి అంగన్‌వాడీ, పాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు బాగుందన్నారు. మండలంలో తిరుగుతున్న మరో బృందం గ్రూప్‌ 1 అధికారులు కొందూటి సాయినాథ్‌, శ్రావణి, మీదిగేరి విజయరామరాజు, నితీష్‌, నాగశివారెడ్డి, వినోద్‌రెడ్డి, సర్పంచ్‌ సేవ్యానాయక్‌తో కలిసి మండలంలోని సత్రోనిపల్లి తండాలో పర్యటించి స్థానిక పరిస్థితులను తండావాసి చందర్‌నాయక్‌ను కలిసి తెలుసుకున్నారు. భూపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రాములు, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోట గ్రామ శివారులో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలతో గ్రూప్‌ 1 అధికారులు మాట్లాడారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ఆయిల్‌పామ్‌, గోషాల, సేంద్రియ ఎరువులతో పండిస్తున్న అరటితోట, వేరుశనగ పంటలను పరిశీలించారు. ఎంపీడీవో లక్ష్మీనరసింహ, అధికారులు పూజాయాదవ్‌, గిరీష్‌, సత్యారెడ్డి, సుజాత, సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:01 PM