Share News

విత్తన పత్తి రైతులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:39 PM

జిల్లాలో విత్తనపత్తి కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిల్లో జిల్ల రైతులు పెద్దఎత్తున మోసపోతున్నారని, వెంటనే రైతులకు న్యాయం చే యాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితీ జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌కుమార్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు.

విత్తన పత్తి రైతులకు న్యాయం చేయాలి

  • ఎన్‌హెచ్‌పీఎస్‌ జిల్లా చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌

గద్వాలన్యూటౌన్‌,మార్చి25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విత్తనపత్తి కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిల్లో జిల్ల రైతులు పెద్దఎత్తున మోసపోతున్నారని, వెంటనే రైతులకు న్యాయం చే యాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితీ జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌కుమార్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రైతులు పం డించిన విత్తనపత్తి నేరుగా ఆయా కంపెనీలకు మద్యవర్తుల ద్వారా డిసెంబర్‌లో పం టను చేతికి ఇవ్వగా ఆర్గనైజర్లు జిన్నింగు, డిలీటింగ్‌ చేసిన తర్వాత విత్తనాలను ఆ యా కంపెనీలకు సరఫరా చేస్తారని, అనం తరం ఆయా కంపెనీలు జీవోటీ పరీక్షులు నిర్వహించి ఫలితాల్లో పాసైన విత్తనపత్తికి మూడు నెలల సమయం తర్వాత కంపెనీలు మధ్యవర్తుల పేమెంట్‌ చెల్లించిన ఆర్గనైజర్లు మాత్రం వచ్చే పంటకాలం వర కు రైతులకు పేమెంట్‌ ఇవ్వకుండా అప్పటివరకు వడ్డీలు వసులు చేస్తున్నారన్నారు. కాబట్టి ఫలితాలు వెలువడిన వెంటనే మూడు నెలల్లోపు ఏప్రిల్‌ మొదటి వారంలోనే రైతులకు పేమెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్‌ బుచ్చిబాబు, నాయకులు విష్ణు, బలరాంనాయుడు, ప్రే మ్‌రాజ్‌, గోపాల్‌, గొర్ల తిమ్మప్ప, వెంకటేష్‌, దయాకర్‌ ఉన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:39 PM