రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:14 PM
మద్దూర్ మునిసిపాలిటీ రోడ్డు వి స్తరణలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీ ఆర్‌ఎస్ పట్టణ, మం డల నాయకులు డి మాండ్ చేశారు.
మద్దూర్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మద్దూర్ మునిసిపాలిటీ రోడ్డు వి స్తరణలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీ ఆర్‌ఎస్ పట్టణ, మం డల నాయకులు డి మాండ్ చేశారు. మద్దూ ర్‌లోని పార్టీ కార్యాల యంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాత బ స్టాండ్ నుంచి చింతల్‌దిన్నె మార్గంలోని గురు కుల పాఠశాల వరకు చేపట్టిన 70 ఫీట్ల రోడ్డు సందర్భంగా 84 కుటుంబాలు పెద్ద ఎత్తున ని వాసాలను, దుకాణాలను కోల్పోవడం జరిగింద న్నారు. వీరిలో చాలామంది పూర్తి స్థాయిలో ఇ ళ్లను కోల్పోయి నిరాశ్రయులైయ్యారన్నారు. అభి వృద్ధికి బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని అయితే ఈ సందర్భంగా నష్టపోయిన బాధితులను విస్మ రించకుండా తగిన న్యాయం చేయాలన్నారు. బాధితులకు రూ.20 లక్షల పరిహారంతో పాటు 200 గజాల స్థలం కేటాయించి వారికి ప్రభుత్వ మే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరా రు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాడు తామన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్, మునిసిపల్ కౌన్సి లర్లు మున్కన్‌పల్లి నర్సింహ, దినేష్, గోపాల్, మౌలానా, లింగ్యానాయక్ మాజీ ఎంపీపీ శివ కుమార్, బసిరెడ్డి, చికిని అంజయ్య, మహేం దర్, లాలప్ప, విజయ్‌భాస్కర్‌రెడ్డి, భీంసేన్, రా ములు, గురుగౌడ్, భీంసేన్, శంకర్‌నాయక్ అం జి తదితరులున్నారు.