బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:33 PM
కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ నియోజకవర్గంలో భా రత్‌మాలపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.
యాద్గిర్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి పాటిల్, డీఎస్పీని కలిసిన గద్వాల ఎమ్మెల్యే
ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే
గద్వాలన్యూటౌన్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ నియోజకవర్గంలో భా రత్‌మాలపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గా యపడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాదానికి గల కారణాలు, మృతుల కుటుంబాలకు పరిహా రం అందేలా చూడాలని యాద్గిర్ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నారెడ్డి పాటిల్, డీఎస్పీని మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలిశారు. మృతులంతా దినసరి కూలీలని, వీరిని మానవతాదృక్పథంతో ఆదుకోవాలని కోరారు. దీంతో ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని యాదగిరి ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. అనం తరం రాయిచూర్ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబు రామన్‌గౌడ, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ ఉన్నారు.