బీసీలకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:42 PM
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో బీసీ కులాల గణన చేపట్టి, చట్ట సభలలో బీసీలకు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానా లను పెంచాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షు డు కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు.
- బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్
నారాయణపేట న్యూ టౌన్, మార్చి 29, (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో బీసీ కులాల గణన చేపట్టి, చట్ట సభలలో బీసీలకు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానా లను పెంచాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షు డు కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక అం బేడ్కర్ భవన్‌లో బీసీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కు ర్మయ్య ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. రాజకీయంగా అన్యాయానికి గురైన బీసీలకు చ ట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా 2021 జ నాభా ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను పెంచితే మరో వంద ఏళ్లైనా బీసీలకు పాలనలో భాగస్వామ్యం దక్కదని ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్ మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే పా ర్లమెంట్ స్థానాలు పెంచడంలో దేశంలోని దక్షి ణ ప్రాంతానికి అన్యాయం చేకూరేలా కన్పిస్తుం దని అనుమానం వ్యక్తం చేశారు. వీరేష్, వెం కట్రాములు తదితరులు పాల్గొన్నారు.