Share News

సరదా సరదాగా..

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:39 PM

వారంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసే సాప్ట్‌వే ర్‌ ఉద్యోగులు. ఉన్నత విద్యావంతు లు.

 సరదా సరదాగా..
నాగర్‌కర్నూల్‌ కేసరిసముద్రం మినీ ట్యాంక్‌బండ్‌లో చేపలకు గాలం వేస్తున్న హైదరాబాదు యువకులు

- వారాంతంలో పట్నం నుంచి పల్లెకు..

- హైదరాబాదు నుంచి నాగర్‌కర్నూల్‌ మినీ ట్యాంక్‌బండ్‌లో చేపల వేటలో యువత

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వారంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసే సాప్ట్‌వే ర్‌ ఉద్యోగులు. ఉన్నత విద్యావంతు లు. ఇప్పుడు వారాంతాల్లో ప్రకృతి ఒ డిలో ప్రశాంతతను వెతుక్కుంటున్నా రు. బీటెక్‌, ఎంబీఏ వంటి ఉన్నత చ దువులు పూర్తి చేసి ప్రముఖ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తు న్న యువత రిలాక్స్‌ కోసం చేపలు పట్టడం కొత్త ఫ్యాషన్‌గా మార్చు కున్నారు. అందుకు ఉద్యోగాల బిజీలో ఉండే వారు సెలవు వచ్చిందంటే చాలు పట్నం నుంచి పల్లె కు పయనమవుతున్నారు.

హైదరాబాదు నుంచి నాగర్‌కర్నూల్‌కు వస్తున్న యువత

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కేసరిస ముద్రం మినీ ట్యాంక్‌బండ్‌ చెరువు వీరికి ప్ర త్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాదు నుంచి సుమారు 120 కిలోమీటర్లు ప్రయా ణించి ఐదు నుంచి పది మంది సుభ్యులతో కూడిన బృందాలుగా కారు లో ఇక్కడికి చేరుకుంటున్నారు. చేతిలో గాలం పట్టుకుని చెరువు ఒడ్డున గంట ల తరబడి చేపల వేటలో మునిగి పోతూ సరదాగా గడుపుతున్నారు. నగ ర జీవనంతో ట్రాఫిక్‌, కాలుష్యం, ఉద్యోగాల ఒత్తిళ్లతో సత మతమయ్యే యువతకు కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్‌ ప్రశాంత వా తావరణం కొత్త ఉత్సా హాన్ని అందిస్తోంది. చెరు వు చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, చల్లని గాలు లు, పచ్చని పరిసరాలు వారికి మానసిక ప్రశాం తతను కలిగిస్తోంది. చేప లు పట్టడం ద్వారా ఒత్తిడి తగ్గడం తో పాటు స్నేహితులతో కలిసి ఆనం దంగా సమయం గడిపే అవకాశం ల భిస్తోందని వారు చెబుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు స్నేహితులతో కలిసి కేసరిస ముద్రం చెరువుకు చేరుకుని చేపల వేటలో పాల్గొనడం వీరికి ఒక అలవా టుగా మారింది. చేపలు పట్టే ఉత్సా హంతో పాటు పల్లె జీవనశైలిని ఆస్వా దిస్తూ కొత్త అనుభూతి పొందు తున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 11:39 PM