Share News

ప్రాణ సంకటంలో జూరాల

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:55 PM

జూరా ల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. జూరాల చరిత్రలో వానాకాలంలోనే కష్టాలు మొదలు కా వడం ఇదే మొదటి సారి.

ప్రాణ సంకటంలో  జూరాల
జమ్మిచేడు వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న రైతులు

లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ప్రశ్నార్థకం

వారం రోజులుగా కాలువలకు నీళ్లు బంద్‌

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

పోలీస్‌ పహారాలో జూరాల ప్రాజెక్టు

గద్వాల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): జూరా ల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. జూరాల చరిత్రలో వానాకాలంలోనే కష్టాలు మొదలు కా వడం ఇదే మొదటి సారి. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పరిధిలోని అధికారికంగా 1.02లక్షల ఎకరాలలో సాగు చేశారు. మరో 30వేల ఎకరాలను అనధికారికంగా సాగు చేశారు. రెండు నెల ల నుంచి కాలువలకు నీటివిడుదల చేసిన అధి కారులు వారం రోజులుగా కుడి, ఎడమ కాలువ ల గేట్లను మూసి వేశారు. మొదట వారబంధి అన్నారు. ప్రస్తుతం చేతులెత్తేసి తాగునీటికే మొదటి ప్రాధాన్యం అంటున్నారు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు రోడ్డెక్కారు.

ప్రణాళిక లేకుండా నీటి విడుదల..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ ముందే చెప్పింది. ప్రాజెక్టుల్లో ఉన్న నిల్వలలో తాగునీటికే ప్రా ధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అధి కారులు కూడా ప్రభుత్వ సూచన మేరకు మొద ట కాలువలకు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత కుడి ఎడమ కాలువల పరిధిలోని ప్రజా ప్రతినిధుల అగ్రహానికి గురై ప్రణాళిక లేకుండా కాలువలకు నీరువిడుదల చేశారు. దీంతో రైతులు సాగుచేయడంతో సమస్య ఉత్పన్నమైంది.

ఆల్మట్టి, నారాయణపూర్‌ పరిస్థితి అంతే...!

కర్ణాటకలోని ప్రాజెక్టు నీటి నిల్వలు కూడా ఆశాజనకంగా లేవు. ఆల్మట్టి సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం వినియోగించడానికి వీలుండేంది 97.82టీఎంసీలు, నారాయణపూర్‌ పూర్తి సామర్థ్యం 33.31టీఎంసీలు కాగా వినియోగించడానికి ఉండేది 14.76 టీ ఎంసీలే ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులను ఆదుకోవడానికి అక్కడ పరిస్థితి ఆనుకూలంగా ఉన్నా.. నారాయణపూర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆ యకట్టు నుంచి రావాల్సిన సీపేజ్‌ వాటర్‌ జూరాలకు రావడం లేదు. అధికారులు కర్ణా టకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి సీపేజ్‌ వాటర్‌ వస్తుందని అంచనా వేశారు. కానీ అక్కడ కూ డా వారబంధీ పద్దతి పెట్టడంతో వచ్చే కొద్ది పా టి నీళ్ల నుంచి గూగల్‌ బ్యారేజీలో స్టోరేజ్‌ చేసి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు వినియోగిస్తున్నారు. ఇంకా కొద్దిపాటి పారుదల కృష్ణానదిలో ఉంటే రైతులు ఎత్తిపోసుకుంటున్నారు. దాని కారణం గా సీపేజ్‌ వాటర్‌ రావడం లేదని ఇక్కడి అధికారులు అంటున్నారు. దీంతో ఈ ఏడాది వానా కాలంలో జూరాల ఆయకట్టు రైతులకు కష్టాలు మొదలయ్యాయి.

వచ్చింది 247టీఎంసీలు వినియోగించింది 22.94టీఎంసీలు

జూరాల ప్రాజెక్టుకు ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు మొత్తం వరద 247 టీఎంసీ లు వచ్చింది. కానీ ఇందులో సాగునీటికి వినియోగించింది 22.94టీఎంసీలే.. ఇందులో నెట్టెంపాడుకు 5.63టీఎంసీలు, భీమా-1కు 5.22 టీఎం సీలు, కోయిల్‌సాగర్‌కు 2.58టీఎంసీలు, జూరాల కుడి కాలువకు 2.34టీఎంసీలు, ఎడమ కాలువకు 3.55టీఎంసీలు, సమాంతర కాలువకు 1.95టీఎంసీలు, ఇతర మార్గాల ద్వారా(ప్రాజెక్టు లో నుంచి రైతులు మోటార్ల ద్వారా) 1.65 టీఎంసీలు ఎత్తిపోసుకున్నారు. ఇలా మొత్తం 22.94టీఎంసీలను మాత్రమే వినియోగించారు. మిగిలిన వరదను విద్యుత్‌ ఉత్పత్తి ద్వార 82.02 టీఎంసీలు, గేట్ల ద్వార 138.85టీఎంసీలను అం టే దాదాపు 220.87టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు.

Updated Date - Sep 22 , 2026 | 11:55 PM