Share News

ప్రజల సౌలభ్యం కోసం జ్యుడీషియల్‌ కోర్టు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:39 PM

ప్రజల సౌలభ్యం కో సం దేవరకద్రలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ర్టేట్‌ ఫస్ట్‌ క్లాసు కోర్టును గురువారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి వర్చువల్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్మిని స్ర్టేటివ్‌ జడ్జి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవితో కలిసి ప్రారంభించారు.

 ప్రజల సౌలభ్యం కోసం జ్యుడీషియల్‌ కోర్టు
దేవరకద్ర కోర్టు భవన ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.ప్రేమలత, స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

- దేవరకద్రలో నూతన కోర్టును వర్చువల్‌గా ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు

దేవరకద్ర, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల సౌలభ్యం కో సం దేవరకద్రలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ర్టేట్‌ ఫస్ట్‌ క్లాసు కోర్టును గురువారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి వర్చువల్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్మిని స్ర్టేటివ్‌ జడ్జి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానికంగా జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ న్యాయాధికారి ఎం ప్రే మలత, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డిలు రిబ్బన్‌ కట్‌ చేసి న్యాయస్థానం భవనాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా హైకోర్టు జడ్జి మాధవీదేవి మాట్లాడుతూ కొత్త న్యా యస్థానం ప్రారంభం ద్వారా దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపే ట మండలాల ప్రజలకు న్యాయసేవలు మరింత అందుబా టులోకి వస్తాయన్నారు. దీంతో కేసుల విచారణ వేగవంతం కావడంతో పాటు ప్రజలకు సమయపాలనతో కూడిన న్యా యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. నియోజకవర్గం లో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు, కురుమూర్తి స్వామి దేవస్థానం, సమీపంలో మన్యంకొండ దేవస్థానం లాంటి పర్యాటక ప్రదే శాల మధ్య ప్రశాంత వాతావరణం ఉన్నందున దేవరకద్రలో కోర్టును ప్రారంభించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కోర్టు ఏర్పాటు కోసం పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా రన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ కుష్బూ గు ప్తా, ఎస్పీ జానకి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీనియర్‌ న్యాయవాదులు రామేశ్వర్‌ రెడ్డి, నారాయణ గౌడ్‌, చంద్రశేఖర్‌, ప్రజాప్రతినిఽ దులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:39 PM