ఉజ్వల భవిష్యత్ కోసం చారిత్రక కళాశాలలో చేరాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:01 PM
ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు త మ ఉజ్వల భవిష్యత్ కోసం చారిత్రక నేపథ్యం ఉన్న మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి సూచించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాలటౌన్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు త మ ఉజ్వల భవిష్యత్ కోసం చారిత్రక నేపథ్యం ఉన్న మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి సూచించారు. 2026-27 విద్యా సం వత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్ బ్రోచ ర్‌ను సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లాలో తొలి డిగ్రీ కళాశాల ఆవిర్భవిం చిన ఎంఏఎల్‌డీ కళాశాల ఉస్మానియా విశ్వవి ద్యాలయం పరిధిలో అత్యంత ప్రతిష్టను దక్కిం చుకుందన్నారు. అక్కడ చదివిన విద్యార్థుల్లో అనేక మంది ఉన్నత విద్యావంతులుగా ఎదిగి అత్యున్నత పదవులను, స్థానాలకు దక్కించుకు న్న ఖ్యాతి గడించారని గుర్తు చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సం ప్రదాయ కోర్సులతో పాటు మైక్రోబయాలజీ, బ యోటెక్నాలజీ, సైకాలజీ, అప్లయిడ్ న్యూట్రీషి యన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, సోషియాలజీ వంటి సబ్జెక్టులతో కూడిన గ్రూప్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కళా శాలలో ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, పీహెచ్‌డీ అర్హత గల అధ్యాపకబృందం ద్వారా ఉన్నత ప్రమాణా లతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉం దని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమోహన్, అధ్యాపకులు సురేందర్‌రెడ్డి సత్యన్న, సత్తెమ్మ, రాధిక, హరినాగ భూషణం, కరుణాకర్, వెంకటేశ్వరమ్మ, హరినాథ్ ఉన్నారు.