మెట్టినింటికి జములమ్మ
ABN , Publish Date - Jan 28 , 2026 | 10:55 PM
కో రిన కోరికలను తీర్చే కొంగుబంగారం జ ములమ్మ... బుధవారం జమ్మిచేడులోని మె ట్టినింటికి చేరింది. ఊరూరా హారతులతో జములమ్మ తల్లికి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఆకట్టుకున్న అమ్మవారి శోభాయాత్ర
గద్వాల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కో రిన కోరికలను తీర్చే కొంగుబంగారం జ ములమ్మ... బుధవారం జమ్మిచేడులోని మె ట్టినింటికి చేరింది. ఊరూరా హారతులతో జములమ్మ తల్లికి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అమ్మవారిని తీసుకురావడానికి సారెతో ఎద్దుల బండి వె ళ్లింది. సాయంత్రానికి గుర్రంగడ్డకు చేరుకు న్న తర్వాత అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అవుతుండ గానే జములమ్మను కృష్ణానదిలో బోటు ద్వారా బయటికి తీసుకు వచ్చారు. అక్కడ ఎద్దుల బండిపైన అమ్మవారిని కూ ర్చోబెట్టి భాజా భ జంత్రీలతో బీరోలు, లత్తీపురం, వెంకటో నిపల్లి మీదుగా తె ల్లవారుజామున జ మ్మిచేడుకు చేరు కుంది. అక్కడ ఉద యం 5గంటల నుంచి ఆలయం వరకు అమ్మవారి శోభాయాత్ర ఆకట్టుకునే విధంగా సాగింది.
కళాకారుల ప్రదర్శనలతో..
అమ్మవారిని జమ్మిచేడు గ్రామం నుంచి ఆలయం వరకు భాజా భజంత్రీలు, డప్పువాయిద్యాలతో పాటు డీజేతో కళాకారుల నృత్య ప్రదర్శనలతో శోభాయాత్ర సాగింది. గ్రామంలో అమ్మవారికి హారతులు పడు తూ పూజలు చేస్తుండగా మరోవైపు కళాకారుల నృత్యాలు గ్రామస్థులను ఆకట్టుకున్నాయి. దాదాపు 5 గంటల పాటు గ్రామం నుంచి ప్రధాన రోడ్డు వరకు ప్రదర్శనలు చేశారు. రెండేళ్లుగా శోభాయాత్ర సందర్భంగా దాదాపు వంద మంది కళాకారు లు, డప్పు వాయిద్యా లు, డీజేతో ఎంతో హం గామాగా ని ర్వహిస్తూ వ స్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌కు చెం దిన కళాకారుల బృందం బేతెల్, పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో ఆకట్టుకు న్నారు. కాగా భాజా భజంత్రీలతో ఎద్దుల బండిపై ఆలయానికి చేరుకున్న అమ్మవారికి ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి, ఆలయ మాజీ చైర్మన్ వెంకట్రాములు, ఈఓ పురేందర్‌కుమార్‌లు ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని ఆశీనులు చేశారు. ఆదివారం పౌర్ణమిన ప్రత్యేక పూజలందుకొని ఐదు నె లల పాటు కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొ లుస్తారు. కాగా అమ్మవారి శోభాయాత్రలో గత ఏడాది జరిగిన గొడవను దృష్టిలో పె ట్టుకొని ఎస్‌ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. సీఐ టంగుటూరు శ్రీను పర్యవేక్షించారు. అమ్మవారికి సీఐ, ఎస్‌ఐ పూజలు నిర్వహించారు.