జములమ్మ హుండీ ఆదాయం రూ.10.93 లక్షలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:19 PM
నడిగడ్డలో భక్తుల ఇలవేల్పు జములమ్మ తల్లీ ఆలయం లో శుక్రవారం హుండీని లెక్కించారు.
గద్వాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నడిగడ్డలో భక్తుల ఇలవేల్పు జములమ్మ తల్లీ ఆలయం లో శుక్రవారం హుండీని లెక్కించారు. ఎండోమెం ట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఆలయ ఈఓ పు రేందర్ కుమార్‌ల ఆధ్వర్యంలో భక్తులు, మహి ళా సంఘాల సమక్షంలో హుండీల సీళ్లను తొలగించి లెక్కించారు. దాదాపు 120 రోజులకు సంబంధించిన హుండీల ను లెక్కించగా రూ.10,93,132ల ఆదాయం వచ్చిం ది. మిశ్రమ వెండి, మిశ్రమ బంగారం రాలేదని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ హుండీ లెక్కింపునకు మాజీ చైర్మన్ వెంకట్రాములు, మాజీ డైరెక్టర్లు అభిలాష్, వీరేష్ తదతరులు సహకరించారు. ఆలయ ఉద్యోగులు, బ్యాంకు సిబ్బం ది వాటిని మిషన్ ద్వారా లెక్కించి బ్యాం కులో డిపాజిట్ చేశారు.