శివపూజకు వేళాయె..
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:21 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే శైవ క్షేత్రా లకు ప్రసిద్ధి నల్లమల. ఆదివారం మహాశివ రాత్రి పర్వదినం కావడంతో నల్లమల కొం డలపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం మన్ననూర్ లింగమయ్య దేవాలయం, మ ల్లెలతీర్థం, బౌరాపూర్ ఆలయాలు శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమయ్యాయి.
- శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన నల్లమలలోని శైవ క్షేత్రాలు
-మల్లెలతీర్థంలో ప్రారంభమైన పూజలు
అచ్చంపేట, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే శైవ క్షేత్రా లకు ప్రసిద్ధి నల్లమల. ఆదివారం మహాశివ రాత్రి పర్వదినం కావడంతో నల్లమల కొం డలపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం మన్ననూర్ లింగమయ్య దేవాలయం, మ ల్లెలతీర్థం, బౌరాపూర్ ఆలయాలు శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. భక్తుల రాక ను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణం గా ఆలయ ప్రాంగణాలలో వసతులు ఏ ర్పాటు చేశారు. పచ్చని తోరణాలతో అలం కరించి ముస్తాబు చేశారు. ఆర్టీసీ ఉమామ హేశ్వరం, బౌరాపూర్‌కు ప్రత్యేక బస్సులు నడపనుంది. శనివారం నుంచే బౌరాపూర్ కు చెంచులను తరలించే కార్యక్రమాన్ని అఽ దికారులు ముమ్మరం చేశారు. బౌరాపూర్ లో జరిగే భ్రమరాంబికా మల్లిఖార్జున స్వా మి కల్యాణ మహోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు స్థానిక ఎమ్మెల్యే డా క్టర్ వంశీకృష్ణ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మల్లెల తీర్థానికి పర్యాటకులను, భక్తులను అనుమ తించని అటవీశాఖ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు అను మతివ్వడంతో అక్కడి జలపాత అందాలు చూసేందుకు భక్తులు, పర్యాటకులు భారీ గా తరలుతున్నారు. ఈ నేపథ్యంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లమల ఓంకారనాథంతో ప్ర తిధ్వనించనుంది.