కరువు జిల్లాగా ప్రకటించాలి
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:38 PM
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్, కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రాము, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
- అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్
నారాయణపేట రూరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్, కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రాము, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని కోటకొండ గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో సాధరణంతో పోలీస్తే సుమారు 50శాతం తక్కువ వర్షాపాతం నమోదై వరి, పత్తి, కంది పంటలు ఎండిపోయాయన్నారు. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా రైతాంగాన్ని కరువు పరిస్థితుల నుంచి కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమరంలో యాదగిరి, చెన్నారెడ్డి, నారాయణ, వెంకట్రాములు, హాజీమలంగ్, రాములు, ఎం.సుభాష్, రఫి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువక పంటలు దెబ్బతిని రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయారని దీంతో నారాయణ పేట కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కోశాధికారి రామకృష్ణ, న ర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం మండలం లోని మల్‌రెడ్డిపల్లిలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. మనోహర్, వెంకటేశ్, వెంకటప్ప, కిషన్, మహేశ్ పాల్గొన్నారు.