Share News

రైతులను వేధించడం తగదు

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:36 PM

ఆర్‌టీఓ అధికారులు వేధిస్తున్నారంటూ రైతులు ఆరోపిం చారు. సోమవారం జిల్లా ఆర్‌టీఓ కార్యాలయం నుంచి వచ్చాము.

రైతులను వేధించడం తగదు

  • ఆర్‌టీఓ అధికారులమంటూ డబ్బుల వసూలు

  • ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

అయిజ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆర్‌టీఓ అధికారులు వేధిస్తున్నారంటూ రైతులు ఆరోపిం చారు. సోమవారం జిల్లా ఆర్‌టీఓ కార్యాలయం నుంచి వచ్చాము.. అనుమతిలేకుండా ట్యాంకర్ల ద్వారా నీరు ఎలా కొడతారని బెదిరించి, వేధించి మా నుంచి రూ.5,వేలు తీసుకెళ్లారంటూ తుపతురాల గ్రామానికి చెందిన రైతులు మాణిక్యం, మహిందర్‌గౌడ్‌ తెలిపారు. తమ పంట పొలాలకు నీరు లేక ఎండిపోతున్న కారణంగా ట్యాంకర్ల ద్వారా అయిజలోని పెద్దవాగు నుండి ము రుగునీరు తెచ్చి పంటపొలాలకు పోస్తున్నామం టూ తెలిపారు. అనుమతులు లేకుండా నీరు ఎలా ట్యాంకర్ల ద్వారా కొడతారు నిలిపివేయాలని, లేదా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళతాము అక్కడ ఫైన్‌ కింద రూ.లక్షా 50వేలు చెల్లించాల్సి వ స్తుందని భయపెట్టి, మా నుంచి డబ్బులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తెలిసిన జిల్లా బీఆర్‌ఎస్‌వీ నాయకులు కుర్వ పల్లయ్య రై తుల పంట పొలాలకు వెళ్లి అక్కడే రైతులకు మద్దతు తెలిపారు. రేవంత్‌రెడ్డి పాలనలో రైతులను పీడించటం తగదని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులతో కలిసి పంట పొలంలోనే నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతులు బాలు, రాజు, చిన్నపెద్దయ్య, ఉశేని, సుజాత, ఈరన్న, భగవన్‌దాసు, ధర్మన్న, రాయుడు, రాజు, నా గయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:36 PM