మైసమ్మ దేవస్థానంలో సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:22 PM
ప్రతీ ఆది వారం జరిగే నాయి నోనిపల్లి మైసమ్మ దేవస్థానంలో భక్తు లు అనేక సమస్యల తో ఇబ్బందులు పరి ష్కరించాలని బీజేపీ కొల్లాపూర్ నియోజ కవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు డిమాండ్ చేశారు.
- బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు డిమాండ్
పెద్దకొత్తపల్లి, జూలై 19 (ఆంధ్ర జ్యోతి): ప్రతీ ఆది వారం జరిగే నాయి నోనిపల్లి మైసమ్మ దేవస్థానంలో భక్తు లు అనేక సమస్యల తో ఇబ్బందులు పరి ష్కరించాలని బీజేపీ కొల్లాపూర్ నియోజ కవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు డిమాండ్ చేశారు. మైసమ్మ దేవస్థానం లో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పెద్దకొత్తపల్లి నంచి ఆలయం వద్ద బీ జేపీ పోరుబాట కార్యక్రమాన్ని సుధాకర్‌రావు పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టా రు. ఆలయ ప్రాంతాలను ఆయన సందర్శించి భక్తులను సమస్యలు అడిగి తె లుసుకున్నారు. ప్రధానంగా ఆలయం పరిసర ప్రాంతాల్లో టెండర్ లేకుండా అ క్రమ వసూళ్లకు పాల్పడుతున్న మంత్రి అనుచరులపై చర్యలు తీసుకోవాలని సుధాకర్‌రావు డిమాండ్ చేశారు. అలాగే దేవాలయంలో నెలకొన్న 10 ప్రధాన సమస్యలపై ఆయన ఆలయ ఈవో శేఖర్‌గౌడ్‌కు వివరించారు. వీటిని తక్షణ మే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సుధాకర్‌రావు హెచ్చరిం చారు. పెద్దకొత్తపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు దేశమోని పరుశరాముడు, జి ల్లా కార్యదర్శి తిరుమలయాదవ్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలాల్ శివుడు, నాయకులు బద్దుల ప్రవీణ్‌కుమార్‌యాదవ్, నాగరాజుయాద వ్, అమ్మపల్లి మల్లేష్, కృష్ణారావు, కోట్ల సుధాకర్, మార్కండేయ జగదీశ్వర్, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.