వివాహేతర సంబంధమే కారణం?
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:44 PM
జోగుళాంబ గద్వాల జిల్లా, బల్గెరకు చెందిన తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.
- యువకుడి హత్యపై విచారణ ముమ్మరం
- పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు!
గట్టు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా, బల్గెరకు చెందిన తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. హతుడి తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు మిట్టదొడ్డి గ్రామానికి చెందిన తాపీ మేస్తీ అబ్రహాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. బల్గెరకు చెందిన సనక దేవన్నకు ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరూ తాపీ మేస్త్రీలుగా పని చేసేవారు. వారిలో పెద్ద కుమారుడు ఏబేలు నాలుగు నెలల క్రితం బల్గెరలో ఓ ఇంటి నిర్మాణం సమయంలో గోడకూలి మృతి చెందాడు. అయితే ఏబేలు భార్యతో అబ్రహాంకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఏబేలు మృతి తరువాత అబ్రహాం తన సబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ విషయం తిమ్మకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని వారిద్దరినీ పలుమార్లు హెచ్చరించారు. దీంతో అబ్రహాం అతడిని మద్యం పేరుతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతిగా మద్యం తాగించి, బండరాయితో మోది చంపినట్లు తెలస్తోంది. ఇందులో ఏబేలు భార్య పాత్ర కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా సంఘటనపై కేసు నమోదు చేశామని, సీఐ టీ.శ్రీను అధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.