Share News

నవంబరు చివరిదాకా సాగునీరు

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:33 PM

రైతులకు నవంబరు చివరి వరకు వారబంది పద్ధతిలో సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

నవంబరు చివరిదాకా సాగునీరు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

ఇరిగేషన్‌ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల న్యూటౌన్‌, అక్టోబరు5(ఆంధ్రజ్యోతి): రైతులకు నవంబరు చివరి వరకు వారబంది పద్ధతిలో సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఆ యన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగుచేసిన పంటలు కాపాడేందుకు వారబంది పద్ధతిలో నవంబరు చివరి వరకు రైతులకు నీటి విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. అధికారులు, రైతులు సమన్వయంతో ముందు కు వెళ్తేనే చివరి ఆయకట్టు వరకు నీటిని అం దజేయడానికి సాధ్యమవుతుందన్నారు. సంగా ల రిజర్వాయర్‌ నీళ్లు నింపడం వల్ల గద్వాల పట్టణ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సు భాన్‌, నాయకులు రమేశ్‌నాయుడు, రాజారెడ్డి, నీటిపారుదల శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు, గద్వాల సీఐ శ్రీను తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:33 PM