సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:47 PM
గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టు కింద సాగు చేసి న రైతుల పంటలను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్‌పర్సన్ సరిత మంగళవారం ఫో న్‌లో కోరారు.
ఫోన్‌లో సీఎంను కోరిన టీజీఎస్‌జీడీసీఎవ్‌ఎల్ చైర్‌పర్సన్ సరిత
గద్వాల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టు కింద సాగు చేసి న రైతుల పంటలను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్‌పర్సన్ సరిత మంగళవారం ఫో న్‌లో కోరారు. కలెక్టరేట్‌కు వచ్చిన సరిత మొదట కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు పంటల పరిస్థితిని వివరించి సాగునీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం నీటి వి డుదల సీఎం, మంత్రుల చేతుల్లో ఉందని కలెక్టర్ చెప్పారు. దీంతో ఆమె సీఎంతో, అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. పంటలు పరిస్థితి, రైతుల ఆందోళన గు రించి వివరించారు. దీంతో సాగునీటి పారుదల, వాతావరణ శాఖల అధికారులతో మాట్లాడి సా నుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.