Share News

చేనేత సొసైటీల్లో అక్రమాలపై విచారించాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:16 PM

జిల్లాలో మూడు చేనేత సొసైటీల్లో జరిగిన అవ కతవకలపై వెంటనే విచారించాలని టీడీపీ నా యకుడు ఓంప్రకాష్‌ ముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ జి ల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్‌, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగల శ్రీనివాస్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ కార్య దర్శి కెంచి నారాయణ డిమాండ్‌ చేశారు.

చేనేత సొసైటీల్లో అక్రమాలపై విచారించాలి
కరపత్రాలు విడుదల చేస్తున్న పార్టీల నాయకులు

నారాయణపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు చేనేత సొసైటీల్లో జరిగిన అవ కతవకలపై వెంటనే విచారించాలని టీడీపీ నా యకుడు ఓంప్రకాష్‌ ముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ జి ల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్‌, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగల శ్రీనివాస్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ కార్య దర్శి కెంచి నారాయణ డిమాండ్‌ చేశారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. నారాయణపేట చేనేత సొసైటీలో రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలపై విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సొసైటీలో వ్య క్తిగత ప్రయోజనాల కు వాడుకుంటు అ ధ్యక్ష, కార్యదర్శులను తొలగించి చేనేత కా ర్మికులకు న్యాయం చేయాలన్నారు. అ ర్హులైన కార్మికులకి సభ్యత్వం కల్పించా లన్నారు. నేతన్న బీ మా పథకం రూ.5 లక్షలు దళారుల చేతిలో పడుతున్నాయని ఆరో పించారు. 1961లో గాంధీనగర్‌ సొసైటీ ఆధ్వ ర్యంలో వంద మంది చేనేత కార్మికులకు 444 గజాల ప్రకారం ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిం చి ఇచ్చినా నేటికి కార్మికులకు యాజమాన్య హ క్కు పత్రాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉంద న్నారు. చేనేత కార్మికుల సమస్యల సాధన కో సం సెప్టెంబరు 9న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట అఖిల పక్షం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వ హిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ధర్నా కర పత్రాలను విడుదల చేశారు. సమావేశంలో న ర్సింహ, రాఘవనాయుడు, హుస్సేన్‌, అశోక్‌, గౌ తమ్‌, శివ, అజయ్‌, తుల్జారామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:16 PM