పంచలోహ విగ్రహాల చోరీపై పరిశీలన
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:12 AM
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీరంగనాథ స్వా మి ఆలయంలో పంచలోహ విగ్రహాలు దొం గతానికి గురైన ఘటనపై ఎండోమెంట్ సెల్ నాయకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ స్వాతిరెడ్డి మాట్లాడారు.
- శ్రీరంగనాథ ఆలయంలో రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కోకన్వీనర్ స్వాతిరెడ్డి, బీజేపీ నాయకులు
శ్రీరంగాపురం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యో తి): వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీరంగనాథ స్వా మి ఆలయంలో పంచలోహ విగ్రహాలు దొం గతానికి గురైన ఘటనపై ఎండోమెంట్ సెల్ నాయకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ స్వాతిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లోని ప్రసిద్ధమైన ప్రముఖ పుణ్య స్థలమైన శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో పంచలో హ విగ్రహాల దొంగతానికి పాల్పడటం అ త్యంత విచాకరమన్నారు. అత్యంత ప్రముఖ మైన దేవాలయంలో చోరీ జరగడం అంటే హిందూ దేవాలయాల భద్రతపై ప్రభుత్వాని కి చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమవు తుందన్నారు. ప్రసిద్ధ దేవాలయంలో చోరీ జ రిగి నాలుగు రోజులైనా ఇంకా నిఽందితులను పట్టుకోకపోవడం శోచనీయమన్నారు. వెంట నే జిల్లా ఎస్పీ ఈ సంఘటనపై ప్రత్యేక చొ రవ తీసుకొని పంచలోహ విగ్రహాలను తిరిగి స్వాధీనపరుచుకొని అధికారులకు అప్పగించి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీ జేపీ నాయకులు డిమాండ్ చేశారు. పాల మూరు ఎండోమెంట్ జాయింట్ కన్వీనర్ గో పాలకృష్ణ, సభ్యులు భరత్‌కుమార్, జిల్లా జా యింట్ కన్వీనర్ విజయ్‌కుమార్, శంకర్‌నా యక్, అమిత్‌కఉమార్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్‌సాగర్, శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు విష్ణువర్దన్ నాయుడు, వనపర్తి టౌన్ మాజీ ప్రధాన కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.