అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:23 PM
పగటి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్తుడు వడ్డె పీట్ల గంగాధర్(31)ను జోగు ళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పోలీసులు అరెస్టు చేశారు.
- మూడు రాష్ర్టాల్లో 43 కేసులు
- పది తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం
వడ్డేపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : పగటి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్తుడు వడ్డె పీట్ల గంగాధర్(31)ను జోగు ళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మూడు రాష్ర్టాల్లో 43 కేసులు నమోదైనట్లు గద్వాల డీఎస్పీ మొగులయ్య వెల్లడించారు. సోమవారం శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వ హించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన గంగాధర్ శాంతినగర్ పట్ట ణంలోని ఇందిరానగర్ కాలనీలో ఈనెల 14న చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, సోమ వారం తెల్లవారుఝామున నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 20 తులాల బంగారంలో పది తులాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శంకర్, ఎస్‌ఐ నాగశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.