అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:32 PM
నారాయణపేట జిల్లాలో గంజాయి విక్రయించినా, సేవించినా వారి ని వదిలే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
- ముగ్గురు నిందితుల రిమాండ్, 1.4 కేజీల గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట క్రైం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో గంజాయి విక్రయించినా, సేవించినా వారి ని వదిలే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన ట్లు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో వివరాలను వె ల్లడించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి గంజా యిని తీసుకువచ్చి తెలంగాణలోని నారాయణపే ట సరిహద్దు ప్రాంతాలైన మక్తల్, మాగనూర్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముగ్గురు నింది తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి రూ. 60 వేల విలువ చేసే 1.4 కిలో ల గంజాయి, రూ. 7 వేల నగదు, ఓ స్కూటీతో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకు న్నామన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూ ర్కు చెందిన కొరాడి అశోక్, మహారాష్ట్రలోని సో లాపూర్కు చెందిన రాజశేఖర్, ఎండీ యాసిన్లు కలిసి మహారాష్ట్ర నుంచి గంజాయిని కొనుగోలు చేసి రాయిచూర్ మీదుగా మక్తల్ ప్రాంతంలో విక్రయిస్తూ ప ట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులకు డ్ర గ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఈ కేసు కు సంబంధించి గంజాయిని మొదట ఎక్కడి నుంచి తీ సుకువచ్చారు, ఇందులో ఎంతమంది ప్రమేయం ఉన్నదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ రివార్డులు అందించి అభినందిం చారు. డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ రాజు, టాస్క్ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, ఎస్బీ ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తదితరులు పా ల్గొన్నారు.