Share News

విద్యార్థి దశలో క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:38 PM

వి ద్యార్థి దశలోనే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొం దించడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో మే ధాశక్తి మెరుగుపర్చుకుం టారని సుబ్బయ్య విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక స భ్యుడు మోహన్‌ బాబు అన్నారు.

 విద్యార్థి దశలో క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి
పాలెంలో చెస్‌ పోటీల్లో చదరంగం ఆడుతున్న విద్యార్థులు

- సుబ్బయ్య విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక సభ్యుడు మోహన్‌బాబు

బిజినేపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : వి ద్యార్థి దశలోనే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొం దించడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో మే ధాశక్తి మెరుగుపర్చుకుం టారని సుబ్బయ్య విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక స భ్యుడు మోహన్‌ బాబు అన్నారు. బిజినేపల్లి మం డలంలోని పాలెంలోని వేంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో మం డల స్థాయి అండర్‌-16 చెస్‌ పోటీలు ఆదివా రం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రభు త్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థులు చెస్‌ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో మొదటి బహుమతి సాధించిన ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థి మానస్‌కు రూ.5 వేలు, రెండో బహుమతి శశిధర్‌కు రూ.3వేలు, మూడవ బహుమతిగా రూ.2 వేలు మేధాన్స్‌ స్కూల్‌ విద్యార్థి జునాద్‌ నవాజ్‌కు, బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన యాస్మిన్‌కు, వ డ్డెమాన్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన త్రినేత్ర లకు నాల్గో బహుమతిగా రూ.వెయ్యి చొప్పున అందజేయడంతో పాటు మెడల్స్‌ అందజేసి అ భినందించారు. పోటీల్లో పాల్గొన విద్యార్థులందరికీ ధ్రువీ కరణ పత్రాలు, మెడల్స్‌ అందజేయడంతో పా టు భోజన వసతి కల్పించారు. వ్యవసాయ క ళాశాల అసోసియేటెడ్‌ డీన్‌ డాక్టర్‌ పుష్పావతి, విశ్రాంత ఉపాధ్యాయుడు గాడి సురేందర్‌, ర ఘుబాబు, దీప్తి వేదాంశ్‌, మహిపాల్‌ రెడ్డి, కృ ష్ణగౌడ్‌, కోచ్‌లు సంతోషి, గీత, వైష్ణవి, జగదీష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:38 PM