Share News

సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:37 PM

రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఆదేశం మేరకు ఈ ఏడాది నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించనున్నారు.

సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

- ఈ నెల 25 నుంచి ప్రారంభం

- గద్వాల జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలు

- హాజరు కానున్న 2,271 మంది విద్యార్థులు

గద్వాల సర్కిల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఆదేశం మేరకు ఈ ఏడాది నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించనున్నారు. ఇంటర్‌ ప్రథమ (ఒకేషనల్‌), ద్వితీయ (జనరల్‌, ఒ కేషనల్‌) ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం అధికార యంత్రాంగం ఆయా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆ కెమెరాలను ఇంటర్‌ బోర్డు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు.

ఒక్కో కేంద్రంలో 4 కెమెరాలు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. వాటిలో ప్రభుత్వ కళాశాలలు 8, బీసీ గురుకులాలు 4, ఎస్సీ గురుకులాలు 6, కేజీబీవీలు 10, ట్రైబ ల్స్‌ 1, గురుకుల జూనియర్‌ కళాశాల 1, మైనార్టీ 2, ప్రైవేట్‌ కళాశాలలు 15 ఉన్నాయి. ప్రయోగ పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో 4 సీసీ కెమెరాల చొప్పున, 56 సీసీ కెమెరాలను బిగించారు. ప్రయోగ పరీక్షలకు 2,271 మంది హాజరుకానున్నారు. వారిలో 1,201 మంది బాటనీ, 1,201 మంది జువాలజీ, 2,271 మంది ఫిజిక్స్‌, 2,271 మంది విద్యార్థులు కెమిస్ర్టీ విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:37 PM