Share News

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:37 PM

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్‌ అకాడమిక్‌ పరీక్షల ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్‌ ఆదేశించారు.

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న ఇంటర్‌ అకాడమిక్‌, పరీక్షల ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్‌, చిత్రంలో ఇంటర్‌ పరీక్షల జిల్లా కన్వీనర్‌ హృదయరాజు

ఇంటర్‌ పరీక్షల ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్‌

గద్వాల సర్కిల్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్‌ అకాడమిక్‌ పరీక్షల ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్‌ ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షల నిర్వహణ నేపథ్యంలో గురువారం గద్వాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షల జిల్లా కన్వీనర్‌ హృదయరాజు ఆధ్య క్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 8,471 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు తదితర వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఐఈవో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాలలో సీసీకెమెరాలను ఇంటర్‌ బోర్డుకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ వీరన్న, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ, డీఈసీ సభ్యులు దేవేందర్‌రెడ్డి, పద్మావతి, ఆయా పరీక్షా కేంద్రాల సీఎస్‌, డీవోలు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:37 PM