ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:04 PM
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించా రు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రా ల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో 8,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపా రు. వీరిలో ఫస్ట్ ఇయర్ 4,366 మంది, సెకండ్ ఇయర్ 4,105 మంది ఉన్నా రని తెలిపారు. పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చీప్ సూపరింటెండెంట్లు, ప్లయింగ్ స్వ్కాడ్, డిపార్ట్‌మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్‌ల ను ఏర్పాటు చేసి కఠిన నిఘా పెట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లను పోలీసుస్టేషన్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్నిపరీక్ష కేంద్రాల్లో ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశం లో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ శంకర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయరాజు, విద్యుత్ శాఖ అధికా రి రమేశ్‌బాబు, ఆర్టీసీ అధికారి సునీత, విద్యాశాఖ సహాయ అధికారి శ్రీని వాస్ తదితరులు ఉన్నారు.