హ్యాండ్‌బాల్ జిల్లా జట్ల ముమ్మర సాధన
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:07 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థా యి అండర్-14 బాలబాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ఏ ర్పాట్లు పూర్తయ్యాయి.
- నేటి నుంచి రెండు మైదానాల్లో మ్యాచ్‌లు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థా యి అండర్-14 బాలబాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రం లోని 10 ఉమ్మడి జి ల్లాల బాల, బాలికల జట్లు పాల్గొంటాయి. శుక్రవారం నుంచి లీగ్‌కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. మహబూబ్‌నగ ర్ గ్రామర్ స్కూల్ పోటీలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి ఉమ్మడి జిల్లా జట్ల కోచ్‌లు ప్రదీప్‌కుమార్, అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యం లో శిక్షణలు నిర్వహిస్తున్నారు.