Share News

రోడ్ల పక్కన మద్యం విక్రయాలపై తనిఖీలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:37 PM

గద్వాల జిల్లాకేంద్రంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు బెల్డ్‌ దుకాణాలుగా మారుతూ మద్యం విక్రయాలు సాగిస్తుండటంతోనే ప్రమాదాలు ఎ క్కువగా జరుగుతున్నాయని భావించిన పోలీసులు ఆదివారం జిల్లా కేంద్రంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

రోడ్ల పక్కన మద్యం విక్రయాలపై తనిఖీలు

గద్వాల క్రైం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాకేంద్రంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు బెల్డ్‌ దుకాణాలుగా మారుతూ మద్యం విక్రయాలు సాగిస్తుండటంతోనే ప్రమాదాలు ఎ క్కువగా జరుగుతున్నాయని భావించిన పోలీసులు ఆదివారం జిల్లా కేంద్రంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేం ద్రంలోని మెడికల్‌ కళాశాల వెళ్లే మార్గం, జమ్మిచేడు, అయిజ రోడ్డు, సంగాలరోడ్డుకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన చికెన్‌, మటన్‌, ఫిష్‌ రో స్టులు వేసే దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దుకాణాల రూపంలో వేసిన తడికెల షె డ్డులో మద్యం తాగడంతో పాటు దుకాణాలలో ఉన్న ఫ్రిజ్‌లలో మద్యం సీసాల కోసం తనిఖీ చేశారు. ఇకపై రోడ్డుపక్కన మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాలకు మద్యంమత్తు, అతివేగమే కారణమన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:37 PM