యూరియా పంపిణీ కేంద్రాల తనిఖీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:27 PM
జిల్లాలో ని అన్ని మండలాల్లో రైతులకు తగిన మోతాదు లో యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ తెలిపా రు.
వడ్డేపల్లి, అయిజలలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్
వడ్డేపల్లి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ని అన్ని మండలాల్లో రైతులకు తగిన మోతాదు లో యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ తెలిపా రు. ఎరువుల తనిఖీ కార్యక్రమంలో భాగంగా శు క్రవారం వడ్డేపల్లి మండల పరిధిలోని శాంతి న గర్, జులేకల్‌లో యూరియా పంపిణీ కేంద్రా ల ను జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. అనంతరం సక్రియా నాయక్ మాట్లాడుతూ రైతులు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ అవసరానికి అనుగుణంగా యూరియాను కొనుగోలు చేయవచ్చని సూచించారు. యూరి యా కొరత ఉన్నందన్న ఎవరి మాటలను నమ్మవద్దన్నారు. పంటల అవసరాలకు అను గుణంగా కొనుగోలు చేయాలన్నారు. యూరి యా కొనుగోలు చేసేందుకు రైతులు తమ ఆధార్‌కార్డు, పొలం పాస్‌బుక్ తీసుకుని కొ నుగోలు కేంద్రాలకు వెళ్లి, వివరాలను న మోదు చేసుకున్న తర్వాత యూరియా బస్తాలను పొందవచ్చన్నారు.
అయిజ : జిల్లాలోని రైతులకు కా వాల్సినంత యూరియా అందుబాటులో ఉం దని జిల్లా వ్యవసాయాధికారి సక్రియానాయక్ తెలిపారు. శుక్రవారం అయిజలోని ఎరువుల దు కాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలే కరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండ లాల్లోని రైతులకు సరిపడా యూరియా ఉంద న్నారు. ఈవిషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా కావాల్సిన రై తులు తమ ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకంతో ఎరువుల దుకాణానికి వెళ్లి, ఆన్‌లై న్‌లో వివరాలు నమోదు చేసి యూరియా పొం దాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీకాంత్ పాల్గొన్నారు.