దొరల పాలనలో బహుజనులకు అన్యాయం
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:14 PM
BSP state general secretary Prithviraj said that the Bahujan people are being subjected to immense injustice under the rule of the ruling elites in the state.
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్
మరికల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రా ష్ట్రంలో ఆధిపత్య దొరల పాలనలో బహుజను లకు తీరని అన్యాయం జరుగుతోందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొదిగేల శ్రీని వాసులు అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీ =రాజ్ మాట్లాడుతూ బహుజన వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు అను నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ వేల కోట్ల సంప దను దోచుకుంటూ రాష్ర్టాన్ని ఆగం చేస్తున్నా రని మండిపడ్డారు. పథకాల పేరుతో ఓట్లు దం డుకుంటూ పేదప్రజల జీవితాలతో ఆడుకుంటు న్నారని ఇలాంటి పార్టీలకు బహుజనులందరు ఏకమై ఓటు ద్వారా రాజకీయ సమాధి చే యాలన్నారు. అనంతరం అక్టోబరు 9న కాన్షీ రాం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. సభకు వేలాదిగా ప్రజలు త రలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్ర మంలో పాలమూరు ఇన్‌చార్జి గంగాధర్, చంద్ర య్య, చంద్రశేఖర్, వివిధ మండలాల నాయ కులు పాల్గొన్నారు.