పాలమూరులో ‘ఇందిరమ్మ టవర్లు’
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:34 PM
హైదరాబాద్‌లో ఇదివరకే నిర్మించిన ‘ఇందిరమ్మ టవర్లు’ ఇప్పుడు పాలమూరు కార్పొరేషన్‌లోనూ నిర్మించనున్నారు.
- జీ ప్లస్ ఫైవ్ పద్ధతిలో మొత్తం 12 అపార్ట్‌మెంట్లు
- రాజీవ్ గృహకల్ప నివాసులకు తొలి ప్రాధాన్యం
- ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 8.5 లక్షల వ్యయం
- అందులో లబ్ధిదారుడి వాటా రూ. 3.5 లక్షలు
మహబూబ్‌నగర్, నవంబరు 23 (ఆంధ్రజ్యో తి) : హైదరాబాద్‌లో ఇదివరకే నిర్మించిన ‘ఇందిరమ్మ టవర్లు’ ఇప్పుడు పాలమూరు కార్పొరేషన్‌లోనూ నిర్మించనున్నారు. రాష్ట్రంలోని ఐదు మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఒక్కో కార్పొరేషన్‌కు 480 ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 579 విడుదల చేసింది. ఇందులో పాలమూరు కార్పొరేషన్ కూడా ఉంది. ఇందిరమ్మ టవర్స్ పేరిట జీ ప్లస్ ఫైవ్ పద్ధతిన మొత్తం 12 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు. ప్రతీ అంతస్తులో 8 ఇళ్ల చొప్పున ఒక్కో టవర్‌లో 40 ఇళ్లు ఉంటాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం బండమీదిపల్లి సమీపంలోని నిర్మిత్ కేంద్రం పరిసరాలలో ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించింది. ఇందిరమ్మ టవర్స్‌లో రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఒక్కో ఇంటిని రూ.8.5 లక్షల వ్యయంతో హైదరాబాద్ గృహనిర్మాణ శాఖనే ఇక్కడ కూడా నిర్మాణం చేపట్టనుంది. అందుకోసం ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తుండగా, లబ్ధిదారుడు తన వాటాగా రూ.3.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లబ్ధిదారుడు డబ్బు చెల్లించలేకపోతే మరొకరికి అవకాశం కల్పిస్తారు.
లక్కీడిప్ ద్వారా ఎంపిక
ఇందిరమ్మ టవర్లలో ఇళ్ల కోసం ఆసక్తిగల వారు వచ్చేనెల ఐదవ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అందుకోసం రూ.100 చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకుని, టోకెన్ అడ్వాన్స్‌గా రూ.10 వేలు ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు రాకపోతే ఈ డబ్బులను తిరిగి చెలిస్తారు. ఇల్లు వచ్చిన వారికి లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కలెక్టర్ సమక్షంలో లక్కీడిప్ నిర్వహిస్తారు. మొత్తం 480 ఇళ్లకు 10 శాతం అదనంగా అంటే మరో 48, మొత్తం 530 మంది లబ్ధిదారులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తరువాత ఇందులో అర్హులను ఎంపిక చేస్తారు. ఎవరైనా అనర్హులు ఉన్నా 480 మందికి సర్దుబాటు చేసేలా 10 శాతం మందికి అదనంగా లక్కీడిప్ నిర్వహిస్తారు. డిసెంబరు రెండో వారంలో పనులను ప్రారంభించే అవకాశం ఉంది.
శిథిలావస్థలో ‘రాజీవ్ గృహకల్ప’
బండమీదిపల్లిలోని రాజీవ్ గృహకల్ప స ముదాయాన్ని 2007లో నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇ టీవల ఓ అంతస్తులోని బాల్కనీ కూలిపోవడంతో, వాటి స్థానంలో కొత్తగా ఇండ్లను ని ర్మించి ఇస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యె న్నం శ్రీనివా్‌సరెడ్డి, డిప్యూటీ మేయర్ ఎం సురేందర్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. అం దుకు అనుగుణంగా ఇందిరమ్మ టవర్స్ మం జూరు చేయించారు. గృహకల్ప నివాసులకు ఇందిరమ్మ టవర్స్‌లో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుకోసం గృహకల్పలోని 380 ఫ్లా ట్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరించి, వారిలో అర్హుల జాబితాను తయారు చేయనున్నారు. వారికి ఇందిరమ్మ టవర్లలో ఇళ్లను కే టాయించిన తర్వాత, మిగిలినవి ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుంది.
ఒక్కో ఫ్లాట్ 512 చదరపు అడుగులు
టవర్లలో ఒక్కో ఫ్లాట్‌ను 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ప్రస్తుతం 2 బీహెచ్‌కె ఇళ్లను 576 చ దరపు అడుగుల (64 గజాలలో) విస్తీర్ణంలో నిర్మించారు. ఇందిరమ్మ టవర్స్‌లో హాలు, బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్‌లతో ఫ్లాట్లను ని ర్మించనున్నారు. మంచి విస్తీర్ణంలోనే ఫ్లాట్ ని ర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం నిబంధనలను విధించారు. కార్పొరేషన్ పరిధిలో ఎ క్కడా ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ ఉండరాదు. కు టుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.