Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:03 PM

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గంగాపురంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయిస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

- ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల/నవాబ్‌పేట/రాజాపూర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జడ్చర్ల మండలం గంగాపురం, నవాబ్‌పేట మండలం రాంసింగ్‌తండా, రాజాపూర్‌ మండలం సింగమ్మగూడతండా గ్రామ పంచాయతీ అంజమ్మతండా, నాన్‌చెరువుతండాలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని యజమానులతో గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమ పథకాలను నిరుపేదలకు, అర్హులందరికీ అందజేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు గిరిప్రసాద్‌, జ్యోతి, వెంకట్‌నాయక్‌, రాఘవేందర్‌నాయక్‌, శ్రీనివాస్‌నాయక్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, మహేందర్‌నాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ హరలింగం, మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, వెంకటేష్‌గౌడ్‌, ఎంపీడీవో జయరాములు, జనార్దన్‌రెడ్డి, గోపాల్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:03 PM