Share News

ఇంటింటికీ ఇందిరమ్మ కుటుంబ బీమా

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:00 PM

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19నుంచి అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి పేర్కొన్నారు.

ఇంటింటికీ ఇందిరమ్మ కుటుంబ బీమా
వార్డు ఆఫీసర్లతో సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ రామాంజులరెడి ్డ

- మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి

మహబూబ్‌నగర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19నుంచి అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లకు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికీ ఇందిరమ్మ బీమా పథకం చేరాలని, అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. 18-59 ఏళ్లలోపు పథకానికి అర్హులని ఆధార్‌ ఆధారంగా వయస్సు నిర్ధారణ చేయాలన్నారు. ఈ పథకంలో ఇంటి యజమానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. నగరంలోని ప్రతీ డివిజన్‌లో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. రేషన్‌ కార్డు, ఆధార్‌, కుటుంబసభ్యుల వివరాలు నామినీ వివరాలు తెలియజేయాలన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 11:00 PM