Share News

ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:29 PM

దేశ అభి వృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇందిరాగాంధీ అం దించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి కొనియాడారు.

 ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- జిల్లా కేంద్రంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/వెల్దండ/కల్వకుర్తి/కొ ల్లాపూర్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశ అభి వృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇందిరాగాంధీ అం దించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి కొనియాడారు. గురువారం భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ఇందిరాగాంధీ చి త్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అ ర్పించిన అనంతరం కేక్‌ కట్‌ చేసి కాంగ్రెస్‌ ప్ర జా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు పం చిపెట్టారు. మునిసిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, వైస్‌ చైర్మన్‌ బాదం రమేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్‌, కౌన్సిలర్లు నిజాం, శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- వెల్దండ మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హరికిషన్‌నాయక్‌, నాయకుడు మట్ట వెంకటయ్యగౌడ్‌, సర్పంచ్‌ గన్యానాయక్‌, ఎర్రశ్రీను, శేఖర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(వైఎస్‌), పుల్లయ్య, రషీద్‌, భరత్‌గౌడ్‌, హమీద్‌, కృష్ణముదిరాజ్‌, శ్రీనివాసులు, కిస్టాలు, రంగనాదం ఉన్నారు.

- పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలను కొన సాగిద్దావుని కాంగ్రెస్‌ రాష్ట్రనాయకుడు, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌లు పిలుపునిచ్చా రు. గురువారం కల్వకుర్తి పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇందిరాగాంధీ విగ్ర హానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ పసుల సుదర్శన్‌రె డ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి చిమ్ముల శ్రీకాం త్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ బొమ్మ ఆంజనేయు లు, కౌన్సిలర్‌ ఏజాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాయితీ విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహిళలకు చీరల పంపిణీ

కొల్లాపూర్‌లో భారత మాజీ ప్రధాని, భారత రత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాం గ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గరువారం ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని శ్రీవాణి విద్యాని లయంలో ఇందిరా చిత్ర పటానికి డీసీసీ ఉపా ధ్యక్షుడు రంగినేని జగదీశ్వరుడు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహి ళలకు చీరలు, స్వీట్లు, విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మంత్రి జూపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మునిసిపల్‌ చైర్మన్‌ రెడ్డి జ్యోతి, పాలకమండలి సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మహేది నవాజ్‌, న్యాయవాదులు మధుసూదన్‌రావు, మురళి, రజక స్వామి, జుబే ర్‌ఖాన్‌, రవి ముదిరాజ్‌, గోవింద్‌గౌడ్‌, జావేద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 11:29 PM