Share News

పేదరిక నిర్మూలనకు ఇందిరా గాంధీ కృషి

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:47 PM

పేదరిక నిర్మూలనకు దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలనకు ఇందిరా గాంధీ కృషి
ఇందిరాగాంధీ విగ్ర హానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మహబూబ్‌నగర్‌/దేవరకద్ర/మిడ్జిల్‌/రాజాపూర్‌/మూసాపేట/గండీడ్‌ నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పేదరిక నిర్మూలనకు దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ పేర్కొన్నారు. గరీబి హఠావో నినాదంతో పేద ప్రజలను చేరదీశారన్నారు. గురువారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని రాజీవ్‌చౌరస్తాలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బ్యాంక్‌లను జాతీయకరణ చేశారని, ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో ఆమెను సంఘవిద్రోహక శక్తులు మట్టుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్‌ మమత, నాయకులు బెక్కరి అనిత, చంద్రకుమార్‌గౌడ్‌, జహీర్‌అక్తర్‌, సీజె బెనహర్‌, సాయిబాబ, అజ్మత్‌అలీ, అవేజ్‌, నవనీత, మహేందర్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. దేవరకద్ర మునిసిపాలిటీలో ఎమ్మెల్యే జీఎంఆర్‌ ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొండ దమయంతి, వైస్‌ చైర్మన్‌ యుగేంధర్‌రెడ్డి ఉన్నారు. మిడ్జిల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్పంచు శంకర్‌ పాల్గొన్నారు. రాజాపూర్‌ మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మండల అధ్యక్షుడు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, శ్రీనివాస్‌నాయక్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు. మూసాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్‌ ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, సర్పంచులు ప్రవీన్‌రెడ్డి, రాంచందర్‌ ఉన్నారు. గండీడ్‌ మండల కేంద్రంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇందిరాగాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించారు. అనంతరం పింఛన్‌ ప్రొసిడింగ్‌లు పంపిణీ చేశారు.

Updated Date - Nov 19 , 2026 | 11:47 PM