అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:29 PM
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీ ఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పా ర్టీ జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేశ్ డి మాండ్ చేశారు.
-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేశ్
వనపర్తి టౌన్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యతి): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీ ఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పా ర్టీ జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేశ్ డి మాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మండల అధ్యక్షుడు రవి కిరణ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దళిత నాయకులు వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడిస్తే బీ ఆర్‌ఎస్ నాయకులు ఆ ప్రదేశాన్ని పసుపు నీ ళ్లతో శుద్ధి చేసి తమ దళిత వ్యతిరేక బుద్ధిని ప్ర దర్శించారని మండిపడ్డారు. ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నామని, దీనికి బీఆర్‌ఎస్ పార్టీ అ ధిష్టానం జవాబు చెప్పి దళిత సమాజానికి బ హిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ చా వును తాము ఎప్పుడు కోరుకోలేదని, రాజకీ యంగా మాత్రం బొందపెడతామని అన్నారు. దళితుల శాపం తగిలి కేసీఆర్ జీవితకాలం ఫాంహౌస్ నుంచి బయటికి రాడని జోష్యం చె ప్పారు. కార్యక్రమంలో వాల్యా నాయక్, ఎత్తం రవికుమార్, ఆవుల చంద్రశేఖర్, అరవింద్ నా యక్, కురుమూర్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.