Share News

ప్రజాస్వామ్య పరిరక్షణలో. యువత పాత్ర కీలకం

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:09 PM

ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర అత్యంత కీలకమని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో. యువత పాత్ర కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

పాలమూరు యూనివర్సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర అత్యంత కీలకమని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ, ఇంటర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎన్‌ఎ్‌సఎ్‌స సెల్‌ ఆధ్యర్యంలో వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి యువత పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం కేవలం ఓటు హక్కుతో మా త్రమే పరిమితం కాకుండా బాధ్యతాయుత భాగస్వామ్యంతో ముందుకు సాగుతుందన్నారు. మా రుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. నైపుణ్యాభివృధ్దికి అధిక నిధులను కేటాయించిందని అన్నారు. అనంతరం పీయూ వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు కేవలం బోధనకే పరిమితం కాకుండా సమాజానికి బాధ్యతాయుత విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయన్నారు. యువ పార్లమెంట్‌ వంటి కార్యక్రమాలు విద్యార్థులలో ప్రజాస్వామ్య అవగాహనను పెంపొందిస్తాయన్నారు. అనంతరం ‘భారత అత్యవసర పరిస్థితి 50 సంవత్సరాలు- భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణ, పీజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, ఎన్‌వైకే కోటానాయక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:09 PM