Share News

శానిటేషన్‌ పనులు మెరుగుపరచండి

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:27 PM

నగరంలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని మేయర్‌ మమత అధికారులను ఆదేశించారు.

శానిటేషన్‌ పనులు మెరుగుపరచండి
59వ డివిజన్‌లో పర్యటిస్తున్న మేయర్‌ మమత, కమిషనర్‌ రామాంజులరెడ్డి

- మేయర్‌ మమత

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని మేయర్‌ మమత అధికారులను ఆదేశించారు. మురుగు కాల్వల నుంచి దుర్గంధం వస్తుందని, దోమల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుంచి పిర్యాదులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు మురుగు కాల్వలు శుభ్రం చేసి బ్లీచింగ్‌, ఫాగింగ్‌ చేయాలన్నారు. మంగళవారం ఆమె మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డితో కలిసి నగరంలోని 59వ డివిజన్‌లో పర్యటించారు. అక్కడ మురుగు కాల్వల పరిస్థితి, పారిశుధ్య పనులను పరిశీలించి, ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. స్ట్రీట్‌ లైట్లు పడటం లేదని, కుక్కల బెడదతో పాటు తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయని ప్రజలు మేయర్‌కు విన్నవించారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని పలువురు కోరారు. మీ సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీలో జరుగుతున్న అండర్‌గ్రౌండ్‌ పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్పొరేటర్‌ తాహెర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:27 PM