రైతుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:58 PM
రైతుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
తాడూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ శివారులో ఎంజీకేఎల్‌ఐ పథకంలో భాగంగా 28వ ప్యాకేజీ డిస్ట్రి బ్యూటరీ కెనాల్‌కు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను మంగళవారం ఆయన పరిశీలిం చారు. డిస్ర్టిబ్యూటరీ కేంద్రం నుంచి సుమారు ఒక కిలోమీటరు మేర కాల్వ ద్వారా నీటి ని మేడిపూర్ చెరువుకు తరలించేందుకు అవసరమైన భూసేకరణ సర్వేకు సంబంధిం చిన మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. మేడిపూర్ చెరువు పరిసర ప్రాంతాలను పరిశీ లించి చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు చర్యలు తీసు కోవాలన్నారు. ఈ సందర్భంగా మేడిపూర్ రైతులు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. కలెక్టర్ వెంట కేఎల్‌ఐ భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, డీపీవో శ్రీరాములు, తహసీల్దార్, సర్పంచ్ మల్లేశ్, రైతులు ఉన్నారు.